- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒడిశా రాజకీయాల్లో సంచలనం.. బీజేడీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన రాజ్యసభ ఎంపీ
by Malleboina Mahesh |
సోమవారం బీజేడీకి రాజీనామా చేసిన రాజ్యసభ ఎంపీ దేబాశిష్ సామంతరాయ్ ఈ రోజు బీజేపీలో చేరారు.

X
దిశ, వెబ్ డెస్క్: ఒడిశా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేడీ పార్టీలో సరైన గుర్తింపు లేదని విమర్శలు చేస్తూ.. సోమవారం ఆ పార్టీకి రాజ్యసభ ఎంపీ దేబాశిష్ సమంత రాయ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా ఎవరూ ఊహించని విధంగా ఆయన అధికార బీజేపీ పార్టీలో చేరారు. ఈ మేరకు ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో బీజేపీ కీలక నేతల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. నవీన్ పట్నాయక్ అత్యంత ఆప్తుడైన వి.కె. పాండియన్ వైఖరి వల్లే తాము నవీన్ బాబును కూడా కలవలేకపోయామని, 2024 ఎన్నికల్లో బీజేడీ ఓటమికి ఆయనే కారణమని సామంత రాయ్ బహిరంగంగా విమర్శించారు. కాగా, ఆయన తన రాజ్యసభ సభ్యత్వ రాజీనామా పత్రాన్ని ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ సి.పి. రాధాకృష్ణన్‌కు సమర్పించారు.
Next Story






