- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏప్రిల్ 17న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక.. మరోసారి హరివంశ్‌కే అవకాశం?
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది.

దిశ, వెబ్‌డెస్క్: రాజ్యసభ (Rajya Sabha)లో కీలకమైన డిప్యూటీ చైర్మన్ (Deputy Chairman) పదవికి ఎన్నిక నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుత డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ (Harivamsh Narayan Singh) పదవీకాలం ముగియడంతో, ఖాళీ అయిన ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఏప్రిల్ 17న ఎన్నికలు జరగనున్నాయి. అయితే, డిప్యూటీ చైర్మన్ పదవికి హరివంశ్ నారాయణ్ సింగ్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మళ్లీ నామినేట్ చేసిన విషయం తెలిసిందే. సభను సమర్థవంతంగా నిర్వహించడంలో, గతంలో ఆయన చూపిన అనుభవం, నిష్పక్షపాత వైఖరిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రపతి నామినేషన్ తర్వాత, ఆయన మరోసారి ఈ పదవిని చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఎన్నిక ప్రక్రియ ఇలా..
నిబంధనల ప్రకారం.. ఏప్రిల్ 17న రాజ్యసభలో సభ్యుల మధ్య ఓటింగ్, ఏకగ్రీవ ప్రక్రియ ద్వారా కొత్త డిప్యూటీ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. హరివంశ్‌కు అధికార పక్షంతో పాటు పలు తటస్థ పార్టీల మద్దతు కూడా ఉండటంతో ఆయన ఎన్నిక దాదాపు ఖాయమని భావిస్తున్నారు. రాజ్యసభలో కీలక బిల్లుల ఆమోదం, సభ నిర్వహణలో డిప్యూటీ చైర్మన్ పాత్ర అత్యంత కీలకం కానుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 17న జరగబోయే ఎన్నికపై అందరి దృష్టి నెలకొంది.






