- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశ సరిహద్దుల్లో సైనికులను కాపాడటం నా బాధ్యత.. రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
భారత్(India), పాకిస్తాన్(Pakistan)ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: భారత్(India), పాకిస్తాన్(Pakistan)ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన సంస్కృతి జాగరణ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. మన సైనికులు దేశ భౌతిక స్వరూపాన్ని రక్షిస్తున్నారు.. మన రుషులు దేశ ఆధ్యాత్మిక రూపాన్ని పరిరక్షిస్తున్నారని అన్నారు. సైనికులు యుద్ధ భూమిలో పోరాటం చేస్తుంటే.. సాధువులు జీవనభూమిలో పోరాడుతున్నారని తెలిపారు. దేశ రక్షణశాఖ మంత్రిగా సరిహద్దుల్లో ఉన్న సైనికుల ప్రాణాలు కావడం తన బాధ్యత అని అన్నారు. మరోవైపు.. దేశంపై దాడికి యత్నించే వారికి తగిన గుణపాఠం చెప్పడం కూడా తన బాధ్యతే అని వెల్లడించారు. ప్రధాని మోడీ నీతి, పట్టుదల అందరికీ తెలుసు. ఇక పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోడీ వరుసగా భేటీ అవుతున్నారు. నిన్న నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె.త్రిపాఠితో చర్చలు జరిపారు. ఇవాళ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీతి సింగ్‌తో తాజా పరిస్థితిపై చర్చించారు. ఈ భేటీలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం పాల్గొన్నారు.






