- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rajnath singh: భారత సైన్యం సాహసాలు భేష్.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఆపరేషన్ సిందూర్‌పై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఆపరేషన్ సిందూర్‌పై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath singh) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్‌లో భాగంగా భారత సైన్యం కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ఉగ్ర స్థావరాలకే పరిమితం కాలేదని, పాక్ సైనిక ప్రధాన కార్యాలయం ఉన్న రావల్పిండిలోని స్థావరాలపైనా దాడులు చేసిందని నొక్కి చెప్పారు. పాక్ ఆర్మీ కార్యాలయం వరకు భారత సైన్యం గర్జించిందని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో బ్రహ్మోస్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీ సెంటర్‌ను ఆదివారం వర్చువల్ గా ప్రారంభించారు. అనంతరం రాజ్ నాథ్ ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగిందని, ఈ టైంలో పాక్ పౌరులను లక్ష్యంగా చేసుకోలేదని తెలిపారు. కానీ పాక్ మాత్రం భారతీయులను టార్గెట్ చేసిందన్నారు. గురుద్వారాలు, దేవాలయాలపై దాడులకు తెగపడిందని ఫైర్ అయ్యారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తన చర్యలను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
భారత సైన్యం ధైర్యం, సంయమనం, ధైర్యాన్ని ప్రదర్శించిందని కొనియాడారు. ఉగ్రస్థావరాలకు తగిన సమాధానం ఇచ్చిందన్నారు. ఉరి, పుల్వామా తర్వాత సర్జికల్ స్ట్రైక్స్, ఇప్పుడు పహెల్గాం తర్వాత ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదంపై భారత్ ఏ విధంగా ఫైట్ చేస్తుందో ప్రపంచానికి చూపించామన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే సరిహద్దుల అవతల ఉన్న వాటి యజమానులు సురక్షితంగా ఉండబోరని ఈ ఆపరేషన్ ద్వారా భారత్ స్పష్టం చేసిందన్నారు. ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక చర్య కాదని, టెర్రరిజంపై భారత్ దృఢ సంకల్పానికి నిదర్శనమని ప్రశంసించారు. భారత్ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటని చెప్పారు.






