- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Karunanidhi : కరుణానిధి శతజయంతి వేళ రూ.100 స్మారక నాణెం
by Hajipasha |
దిశ, నేషనల్ బ్యూరో : కరుణానిధి శత జయంతి సందర్భంగా రూ.100 స్మారక నాణేన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం చెన్నైలో విడుదల చేశారు.

X
దిశ, నేషనల్ బ్యూరో : కరుణానిధి శత జయంతి సందర్భంగా రూ.100 స్మారక నాణేన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం చెన్నైలో విడుదల చేశారు. ఆ నాణేన్ని తమిళనాడు సీఎం, కరుణానిధి తనయుడు ఎం.కే.స్టాలిన్‌కు ఆయన అందజేశారు. ఈసందర్భంగా రాజ్‌నాథ్ ప్రసంగిస్తూ.. భారత రాజకీయ దిగ్గజంగా కరుణానిధిని అభివర్ణించారు. తమిళనాడు పేరును యావత్ దేశంలో చాటి చెప్పిన ఘనత కరుణానిధికే దక్కుతుందన్నారు. తమిళనాడు ప్రజలు కరుణానిధిని ప్రేమగా కళైంగర్ అని పిలుచుకుంటారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కనిమొళి, రాష్ట్ర మంత్రి ఉదయనిధి, కేంద్ర మంత్రి ఎల్.మురుగన్, బీజేపీ స్టేట్ చీఫ్ కె.అన్నామలై తదితరులు పాల్గొన్నారు.
Next Story






