ఏనుగులను ఢీకొట్టి పట్టాలు తప్పిన రాజధాని ఎక్స్‌ప్రెస్

by Malleboina Mahesh |   (  Updated:2025-12-20 06:30:11  IST  )

వేగంగా వెళ్తున్న రైలు.. ఏనుగులను ఢీకొట్టడంతో పట్టాలు తప్పింది. ఈ షాకింగ్ ఘటన అస్సాంలోని లుమ్డింగ్ డివిజన్ పరిధిలో చోటు చేసుకొని తృటిలో భారీ రైలు ప్రమాదం తప్పింది.

ఏనుగులను ఢీకొట్టి పట్టాలు తప్పిన రాజధాని ఎక్స్‌ప్రెస్
X

దిశ, వెబ్ డెస్క్: వేగంగా వెళ్తున్న రైలు.. ఏనుగులను ఢీకొట్టడంతో పట్టాలు తప్పింది. ఈ షాకింగ్ ఘటన అస్సాంలోని లుమ్డింగ్ డివిజన్ పరిధిలో చోటు చేసుకొని తృటిలో భారీ రైలు ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. శనివారం తెల్లవారుజామున సుమారు 2:17 గంటల సమయంలో జమునాముఖ్ - కాంపూర్ సెక్షన్ మధ్య సైరాంగ్ - న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం. 20507) పట్టాలపై ఉన్న ఏనుగుల మందను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో రైలు ఇంజిన్‌తో పాటు ఐదు కోచ్‌లు పట్టాలు తప్పాయి. అయితే, అదృష్టవశాత్తూ ప్రయాణికులు ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని, అందరూ క్షేమంగా ఉన్నారని ఈశాన్య సరిహద్దు రైల్వే (NFR) చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కపింజల్ కిషోర్ శర్మ ధృవీకరించారు.

ప్రమాదం జరిగిన వెంటనే నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. డివిజనల్ ప్రధాన కార్యాలయం నుండి ఉన్నతాధికారుల బృందం, ప్రమాద సహాయక రైళ్లు (Accident Relief Trains) ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. పట్టాలు తప్పిన బోగీలను తొలగించి, రైల్వే ట్రాక్‌ను పునరుద్ధరించే పనులు యుద్ధప్రతిపాదికన జరుగుతున్నాయి. ఈ ప్రమాదంలో మొత్తం 8 ఏనుగుల మృతిచెందినట్లు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటన కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది

Next Story