- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rajasthan: కిలో బంగారం.. రూ.23 కోట్ల నగదు.. రాజస్థాన్ లోని శ్రీకృష్ణ ఆలయానికి భారీ ఆదాయం
రాజస్థాన్‌లోని(Rajasthan) ప్రసిద్ధ శ్రీకృష్ణ ఆలయానికి భారీగా ఆదాయం వచ్చింది. చిత్తోర్‌గఢ్(Chittorgarh ) సమీపంలోని సన్వాలియా సేథ్ ఆలయ (Sanwaliya Seth Temple ) హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది.

దిశ, నేషనల్ బ్యూరో: రాజస్థాన్‌లోని(Rajasthan) ప్రసిద్ధ శ్రీకృష్ణ ఆలయానికి భారీగా ఆదాయం వచ్చింది. చిత్తోర్‌గఢ్(Chittorgarh ) సమీపంలోని సన్వాలియా సేథ్ ఆలయ (Sanwaliya Seth Temple ) హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ఆ ఆలయంలో రెండు నెలల తర్వాత హుండీ లెక్కింపు చేపట్టారు. కాగా.. ఆలయానికి కిలో బంగారు బిస్కెట్లు, రూ.23 కోట్లకు పైగా విలువైన నగదు కానుకలుగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. శ్రీకృష్ణుడికి చిన్న చిన్న బంగారు బిస్కెట్లు, వెండి వస్తువురు, వెండి పిస్టల్, ఫ్లూట్ వంటి ప్రత్యేక వస్తువులను కూడా భక్తులు సమర్పించారు. ఈ విషయాన్ని ఆలయ అధికారులు తెలిపారు. ఆలయానికి ఇప్పటివరకు వచ్చిన ఆదాయంలో ఇదే అతి పెద్ద మొత్తమని పేర్కొన్నారు. అయితే, ఆలయానికి భారీగా విరాళాలు భారీగా ఉండటంతో దశల వారీగా లెక్కిస్తున్నారు. ఇప్పటివరకూ రూ.23 కోట్లకు పైనే నగదు విరాళాలు అందినట్లు పేర్కొన్నారు. ఇంకా హుండీ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. బంగారం, వెండి వస్తువులు, హుండీల నుంచి సేకరించిన వివిధ వస్తువులను తూకం వేసి వాటి విలువను కూడా లెక్కిస్తున్నారు.






