Raj Kundra: నటి శిల్పాశెట్టి భర్తకు ఈడీ నోటీసులు

by Shamantha N |

వ్యాపారవేత్త, బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి(actor Shilpa Shetty) భర్త రాజ్‌కుంద్రాకు(Raj Kundra) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) షాకిచ్చింది.

Raj Kundra: నటి శిల్పాశెట్టి భర్తకు ఈడీ నోటీసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: వ్యాపారవేత్త, బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి(actor Shilpa Shetty) భర్త రాజ్‌కుంద్రాకు(Raj Kundra) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) షాకిచ్చింది. సంచలనం సృష్టించిన పోర్న్ రాకెట్‌ కేసులో(porn racket case) ప్రశ్నించేందుకు ఈడీ రాజ్‌కుంద్రాకు నోటీసులిచ్చింది. సోమవారం ఉదయం 11 గంటలకు ఈడీ ఎదుట హాజరుకాలవాని ఆదేశించింది. ముంబైలోని ఈడీ కార్యాలయంలో ఆయన్ని విచారించనున్నారు. అంతేకాకుండా, ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరిని కూడా ఈడీ విచారణకు పిలిచినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇకపోతే,ఇటీవలే రాజ్‌కుంద్రాకు సంబంధించిన పలు చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. సోదాల తర్వాతే రాజ్ కుంద్రాకు ఈడీ సమన్లు జారీ చేసి విచారణకు పిలవడం గమనార్హం.

రాజ్ కుంద్రా అరెస్టు

ఇకపోతే, ఔత్సాహిక న‌టీన‌టుల‌తో అశ్లీల చిత్రాలు తీయించి.. వాటిని విదేశీ యాప్‌ల్లో అప్‌లోడ్ చేసిన కేసులో రాజ్‌ కుంద్రాను ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అశ్లీల చిత్రాలను నిర్మించారనే ఆరోపణలపై జూన్ 2021లో కుంద్రా అరెస్టు అయ్యారు. రెండు నెలల జైలు జీవితం గడిపిన తర్వాత 2021 సెప్టెంబర్‌లో ఆయనకు బెయిల్ లభించింది. ఈ కేసులో రాజ్ కుంద్రానే కుట్రదారుడు అని ముంబై పోలీసు అధికారులు పేర్కొన్నారు.

Next Story