'రాజ్‌భవన్‌'లు ఇకపై 'లోక్‌భవన్‌'లు

by Muthe.Rajitha |

దేశంలోని గవర్నర్ల నివాసాలైన 'రాజ్‌భవన్‌'లు ఇకపై 'లోక్‌భవన్‌'లు మారబోతున్నాయి.

రాజ్‌భవన్‌లు ఇకపై లోక్‌భవన్‌లు
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలోని గవర్నర్ల నివాసాలైన 'రాజ్‌భవన్‌'లు ఇకపై 'లోక్‌భవన్‌'లు మారబోతున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్ల అధికారిక నివాసాలైన ‘రాజ్‌భవన్‌’లను ‘లోక్‌భవన్‌’గా మారుస్తూ కేంద్ర గృహనిర్మాణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే యూనియన్ టెరిటరీల్లోని ‘రాజ్ నివాస్‌’లను ‘లోక్ నివాస్‌’గా మారుస్తునట్టు పేర్కొంది. ‘రాజ్‌భవన్’ అనే పేరు బ్రిటిష్ వలసవాదాన్ని సూచిస్తుందని, ‘లోక్‌భవన్‌’గా మార్చడం ద్వారా ప్రజాస్వామ్య పంథాలో ప్రజల భవనం లాగ సూచిస్తుందని తెలిపారు. ఈ ఆదేశాలు నవంబర్ 25 నే రాగా.. ఆ వెంటనే పశ్చిమ బెంగాల్, త్రిపురా, కేరళ, తమిళనాడు, అస్సాం తదితర రాష్ట్రాలు డిసెంబర్ 1 నుంచి(నేటి నుంచి) అమలు చేస్తూ సైన్‌బోర్డులు, అధికారిక వెబ్‌సైట్లు, లెటర్‌హెడ్‌లు మార్చేశాయి.

అయితే పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, తమిళనాడులో డీఎంకే వంటి ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు లేకుండా కేంద్రం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని మండిపడ్డాయి. ఇది కేవలం పేరు మార్చడం కాదు రాజకీయ ఉద్దేశంతో చేసిందేనని విమర్శిస్తున్నాయి. కాగా తమిళనాడు గవర్నర్ రవి నేతృత్వంలోని కమిటీ ఈ సిఫార్సు చేసినట్టు సమాచారం.

Next Story