హిమాచల్‌ ప్రదేశ్‌లో వర్ష బీభత్సం.. భారీ వరదలు

by Malleboina Mahesh |   (  Updated:2025-08-06 06:25:53  IST  )

పర్వత ప్రాంతాలు అధికంగా ఉన్న రాష్ట్రాలు అయిన ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అస్సాం, జార్ఖండ్ జమ్మూ, కశ్మీర్ ప్రాంతాల్లో వదరలు గ్రామాలు, పట్టణాలను అతలాకుతలం చేస్తున్నాయి.

హిమాచల్‌ ప్రదేశ్‌లో వర్ష బీభత్సం.. భారీ వరదలు
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తర భారతదేశం తో పాటు ఎగువన ఉన్న రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా పర్వత ప్రాంతాలు అధికంగా ఉన్న రాష్ట్రాలు అయిన ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అస్సాం, జార్ఖండ్ జమ్మూ, కశ్మీర్ ప్రాంతాల్లో వదరలు గ్రామాలు, పట్టణాలను అతలాకుతలం చేస్తున్నాయి. నిన్న ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్ కారణంగా.. కొండచరియలు విరిగిపడి ఓ గ్రామం మొత్తాన్ని ముంచెత్తాయి. ఈ ఘటన మరవకముందే హిమాచల్‌ ప్రదేశ్‌లో వర్ష బీభత్సం సృష్టించింది. కిన్నౌర్‌ టాంగ్లింగ్‌ ఖాడ్‌లో భారీ వర్షాల కారణంగా మెరుపు వరదలు (Flash floods) సంభవించాయి. దీంతో వరద ఉధృతికి అనేక వంతెనలు కొట్టుకుపోయాయి.

ప్రస్తుతం కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో అప్రమత్తం అయిన అధికారులు.. కిన్నౌర్‌ కైలాస్‌ యాత్ర (Kinnaur Kailash Yatra)ను తాత్కలికంగా నిలిపివేశారు. వరదల కారణంగా మనాలీ-చండీగఢ్‌ రహదారి దెబ్బతింది. అలాగే సిమ్లా-చండీగఢ్‌, పఠాన్‌కోట్‌-కాంగ్రా రహదారులపై భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వందల సంఖ్యలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో రాకపోకలు బంద్‌ అయ్యాయి. వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారులు స్పష్టం చేశారు.

Next Story