Raina: ముంబైలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

by B.Srinivas |

మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం అర్ధరాత్రి నుంచి వర్షాలు పడుతుండటంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Raina: ముంబైలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర రాజధాని ముంబై (Mumbai)లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం అర్ధరాత్రి నుంచి వర్షాలు పడుతుండటంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ (Yellow alert) జారీ చేసింది. మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పొరుగున ఉన్న థానే, రాయ్‌గడ్, పాల్ఘర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేసింది. ఈ జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తామని అంచనా వేసింది. ఆదివారం ఉదయం 8 గంటల వరకు ముంబైలో 31 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అధికారులు తెలిపారు. తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో వరుసగా 21 మి.మీ మరియు 20 మి.మీ వర్షపాతం నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. అవసరమైతేనే బయటకు వెళ్లాలని తెలిపింది.

Next Story