వర్ష బీభత్సం.. 63 మంది మృతి, 40 మంది గల్లంతు

by Yella Dhawani Reddy |

హిమాచల్‌‌ప్రదేశ్‌‌ను (Himachal Pradesh) భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.

వర్ష బీభత్సం.. 63 మంది మృతి, 40 మంది గల్లంతు
X

దిశ, వెబ్ డెస్క్: హిమాచల్‌‌ప్రదేశ్‌‌ను (Himachal Pradesh) భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆకస్మిక వరదలు (Floods) సంభవించాయి. ఇంకోవైపు పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. కార్లు కొట్టుకుపోయాయి. అనేక మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇక ఈ వర్షాల కారణంగా ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 63కి పెరిగింది. మరో 40 మంది గల్లంతయ్యారని, 100 మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈనెల 7 వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) పేర్కొంది.

వరదల కారణంగా ఇప్పటివరకు దాదాపు రూ.400 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. అలాగే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వంతెనలు కూలిపోవడంతో పాటు పలుచోట్ల రోడ్లు ధ్వంసం అవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. వరదల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Next Story