- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Prayagraj: మహా కుంభమేళ కోసం 13,000 రైళ్ల ఏర్పాటు
దిశ, నేషనల్ బ్యూరో: ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం రైల్వే శాఖ 13,000 రైళ్లను నడుపుతుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇందులో 3,000 ప్రత్యేక రైళ్లు కూడా ఉన్నాయని ఆయన వెల్లడించారు. కుంభమేళ కోసం ఏర్పాట్లను సమీక్షించేందుకు వారణాసి నుంచి రైల్లో ప్రయాగ్‌రాజ్ చేరుకున్న కేంద్ర మంత్రి, ఈసారి కుంభమేళకు సుమారు 1.5 కోట్ల నుంచి 2 కోట్ల మంది ప్రయాణికులు రైళ్లలో నగరానికి చేరుకుంటారని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకు కుంభమేళ జరగనుంది. ప్రయాగ్‌రాజ్‌లోని ఈశాన్య రైల్వే, ఉత్తర రైల్వే, ఉత్తర మధ్య రైల్వే పరిధిలోని పలు స్టేషన్‌లను పరిశీలించిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. 'గంగా నదిపై నిర్మించిన కొత్త వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ప్రారంభించనున్నారు. కొత్త వంతెనను కూడా పరిశీలించాను. 100 ఏళ్ల తర్వాత ఇక్కడ గంగానదిపై వంతెన నిర్మించారన్నారు. ఈసారి కుంభమేళ కోసం మొబైల్ అన్ రిజర్వ్డ్ టికెట్ సిస్టమ్(యూటీఎస్) మొదటిసారి ఉపయోగించారు. ప్రయాగ్‌రాజ్ స్టేషన్‌లోని మాస్టర్ కంట్రోల్ రూమ్‌కు లైవ్ ఫీడ్‌లను పంపడానికి ప్రతి స్టేషన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మహా కుంభ్ నగర్ నుంచి సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.