- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్త చార్జీలు ప్రకటించిన రైల్వే
by Muthe.Rajitha |
ప్రయాణికుల నెత్తిన చార్జీల భారం మోపింది రైల్వేశాఖ. సవరించిన కొత్త రైల్వే చార్జీలను ప్రకటించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ప్రయాణికుల నెత్తిన చార్జీల భారం మోపింది రైల్వేశాఖ. సవరించిన కొత్త రైల్వే చార్జీలను ప్రకటించింది. 215 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే ఆర్డినరీ క్లాసులో కిలోమీటరుకు ఒక పైసా చొప్పున పెంచింది. మెయిల్ లేదా ఎక్స్ ప్రెస్ నాన్ ఏసీ, ఏసీ తరగతులకు కిలోమీటరుకు 2 పైసల చొప్పున పెంచింది. పెరిగిన చార్జీలు డిసెంబర్ 26 నుంచి అమల్లోకి వస్తాయని రైల్వేశాఖ ప్రకటించింది. ఈ పెంపుతో రైల్వేశాఖకు రూ.600 కోట్ల ఆదాయం వస్తుందని ఆశిస్తోంది. అయితే ఒక ప్రయాణికుడు ఏసీ ట్రైన్ లో 500 కిలోమీటర్లు ప్రయాణిస్తే అతనిపై రూ.10 అదనపు భారం పడనుంది. కాగా భవిష్యత్తులో రైల్వే చార్జీలు మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.
Next Story






