- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైల్వే కొత్త స్కీం.. రిటర్న్ టికెట్లపై 20 శాతం డిస్కౌంట్!
రైల్వే కొత్త స్కీం ప్రకటించింది. రిటర్న్ టికెట్లపై 20 శాతం డిస్కౌంట్ అందిస్తామని తెలిపింది. పండుగల టైంలో రద్దీని తగ్గించేందుకే ఈ స్కీం తెచ్చినట్లు రైల్వే శాఖ చెప్పింది.

దిశ, నేషనల్ బ్యూరో: పండుగల సమయంలో రద్దీని తట్టుకునేందుకు, అలాగే టికెట్ బుకింగ్‌ను సులభతరం చేసేందుకు కొత్త స్కీం తీసుకొచ్చినట్లు రైల్వే శాఖ తెలిపింది. ‘రౌండ్ ట్రిప్ ప్యాకేజ్’ పథకం కింద రిటర్న్ ట్రిప్ కోసం బుక్ చేసిన టికెట్లపై 20 శాతం రిబేట్ అందిస్తున్నట్లు ప్రకటించింది.
‘పెద్ద పండుగల సీజన్‌లో రద్దీని తగ్గించడానికి, బుకింగ్‌లో సమస్యలు లేకుండా చేయడానికి, రెండు వైపులా ఉండే రైళ్లను ఉపయోగించుకోవడానికి ప్రయోగాత్మకంగా రౌండ్ ట్రిప్ ప్యాకేజ్ స్కీంను తీసుకొస్తున్నాం. దీని కింద పండుగల రద్దీ సమయంలో రిటర్న్ టికెట్లపై రిబేట్ అందిస్తున్నాం’ అని రైల్వేశాఖ తెలిపింది. జర్నీలో ఒకే గ్రూప్ ప్రయాణికులు తిరిగొస్తుంటే వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
ఈ స్కీం కింద బుకింగ్స్ ఆగస్టు 14 నుంచి ప్రారంభం అవుతాయి. ఈ ఏడాది అక్టోబర్ 13 నుంచి 26 వరకు ప్రయాణాలకు టికెట్లు బుక్ చేసుకొని, కనెక్టింగ్ జర్నీ ఫీచర్‌తో నవంబర్ 17 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు తిరుగు ప్రయాణాలకు టికెట్లు బుక్ చేసుకుంటే ఈ ఆఫర్ వర్తిస్తుంది.






