- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెరగనున్న రైల్వే టికెట్ ధరలు.. జులై 1వ తేదీ నుంచి అమల్లోకి..!
by Phanindra |
రైల్వే టికెట్ ధరలను కొద్దిగా పెంచాలని రైల్వేశాఖ భావిస్తోంది. కొత్త ధరలు జులై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని సమాచారం.

X
దిశ, నేషనల్ బ్యూరో: వచ్చే నెల నుంచి ట్రైన్ టికెట్ ధరలను కొద్దిగా పెంచేందుకు రైల్వేశాఖ సమాయత్తం అవుతున్నట్లు సమచారాం. రైల్వే వర్గాల ప్రకారం నాన్-ఏసీ మెయిల్, ఎక్స్‌ప్రెస్ ట్రైన్ టికెట్ ధరలు కిలోమీటరుకు ఒక పైసా పెరగనున్నాయి. అలాగే ఏసీ కోచ్‌లపై కిలోమీటరుకు రెండు పైసలు పెంచనున్నారు. అయితే సబర్బన్ ట్రైన్లు, సీజన్ టికెట్లలో ధరలు పెరగవని తెలుస్తోంది. అలాగే 500 కిలోమీటర్ల ప్రయాణం వరకు ఆర్డినరీ సెకండ్ క్లాస్ టికెట్ ధరల్లో కూడా ఎలాంటి పెరుగుదల ఉండదట. అంతకన్నా ఎక్కువ దూరం ప్రయాణిస్తే మాత్రం కిలోమీటరుకు ఒక పైసా పెంచుతారని రైల్వే వర్గాలు చెప్తు్న్నాయి. ఈ పెరిగిన ధరలు జులై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తున్నట్లు సమాచారం. కాగా, ఐదేళ్ల తర్వాత రైల్వే టికెట్ ధరలు పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
Next Story






