- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైల్వే ఛార్జీల పెంపుపై మంత్రి వివరణ
రైల్వే ఛార్జీలను కొంత మేర పెంచే అవకాశముందని వచ్చిన వార్తలపై కేంద్ర రైల్వే సహాయ మంత్రి వి. సోమన్న స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: రైల్వే ఛార్జీలను కొంత మేర పెంచే అవకాశముందని వచ్చిన వార్తలపై కేంద్ర రైల్వే సహాయ మంత్రి వి. సోమన్న స్పందించారు. ప్రయాణికులపై తీవ్ర భారం పడకుండా దశలవారీగా టికెట్ ధరలను సమీక్షించనున్నట్లు ఆయన తెలిపారు. ధరల పెంపు విషయమై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, ఒకేసారి కాకుండా మెరుగైన విధానంలో ఛార్జీలు పెంచే యోచనలో ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఇక చెన్నై సమీపంలోని పరందూర్‌లో ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నేపథ్యంలో అక్కడ రైల్వే స్టేషన్ నిర్మాణంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, ఇప్పటిదాకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని, ఆ విషయమై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని వివరించారు.
రైల్వే శాఖ జులై 1 నుంచి కొన్ని మార్పులు తీసుకురానుందని ఇటీవల వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ ప్రయాణికులకు కిలోమీటరుకు 1 పైసా, ఏసీ తరగతులకు 2 పైసల చొప్పున ఛార్జీలు పెరిగే అవకాశం ఉందని సమాచారం. అయితే 2013, 2020ల ధరల సవరణలతో పోలిస్తే ఈసారి పెంపు తక్కువగానే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.






