- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Delhi Stampede : ఢిల్లీ తొక్కిసలాట ఘటనపై రైల్వేశాఖ క్లారిటీ
ఢిల్లీ రైల్వే స్టేషన్(Delhi Railway Station)లో తొక్కిసలాట(Delhi Stampede) జరిగి 18 మంది మృతిచెందగా.. మరో 30 మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ రైల్వే స్టేషన్(Delhi Railway Station)లో తొక్కిసలాట(Delhi Stampede) జరిగి 18 మంది మృతిచెందగా.. మరో 30 మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. మృతుల్లో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉండగా.. మరణించిన 18మంది పేర్లను అధికారులు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రైల్వేశాఖ 10 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించింది. అయితే ఈ ఘటనపై జరుగుతున్న విచారణపై రైల్వేశాఖ క్లారిటీ ఇచ్చింది. తొక్కిసలాటపై ఉన్నత స్థాయి కమిటీ విచారణ మాత్రమే జరుగుతోందని, మరే ఇతర విచారణ జరగడం లేదని స్పష్టం చేసింది. విచారణకు సంబంధించి తప్పుదారి పట్టించేలా కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయని రైల్వేశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. తొక్కిసలాటపై RPF విచారణ చేస్తుందంటూ పలు వార్తలు ప్రసారం చేయడాన్ని ఖండించింది. నార్త్ రైల్వే మాత్రమే ఇద్దరు సభ్యుల ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని.. ఉన్నత స్థాయి కమిటీ నిర్వహించే విచారణ తప్ప మరే విచారణ జరగడం లేదని, దయచేసి తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని.. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే శాఖ ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది.






