- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాహుల్ ‘ఓటర్ అధికార్ యాత్ర’ షురూ.. ఉత్సాహంగా కదులుతోన్న పార్టీ శ్రేణులు
బీహార్ (Bihar)లో ఎన్నికల సంఘం చేపడుతోన్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను వ్యతిరేకిస్తూ, ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలను ఎత్తిచూపి ఓటర్ల హక్కులను కాపాడటమే లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’ (‘Voter Power Yatra’) 8వ రోజు సుపాల్ నుంచి పున: ప్రారంభమైంది.

దిశ, వెబ్‌డెస్క్: బీహార్ (Bihar)లో ఎన్నికల సంఘం చేపడుతోన్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను వ్యతిరేకిస్తూ, ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలను ఎత్తిచూపి ఓటర్ల హక్కులను కాపాడటమే లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’ (Voter Power Yatra) 8వ రోజు సుపాల్ నుంచి పున: ప్రారంభమైంది. ఈ యాత్రలో రాహుల్ గాంధీతో పాటు వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi), తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ (Tejasvi Yadav) పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుపాల్ పట్టణ వీధుల్లో యాత్ర కొనసాగుతోంది.
ఈ సందర్భంగా ప్రజలకు ప్రచార రథం నుంచి రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకా గాంధీ అభివాదం చేస్తున్నారు. ముందుకు కార్యకర్తలు, ముఖ్య నాయకులు పార్టీ జెండాలు పట్టుకుని ఉత్సాహంగా ముందుకు కదులుతున్నారు. ‘ఓటర్ అధికార్ యాత్ర’ బిహార్‌లోని ససారాంలో ఆగస్టు 17న ప్రారంభమైంది. ఏకంగా 16 రోజుల పాటు 1,300 కి.మీ. మేర కొనసాగి సెప్టెంబర్ 1న పాట్నా సిటీలో ముగియనుంది. ఓట్ల చోరీని అడ్డుకోవడం, ఓటర్ల జాబితా నుంచి పేర్లను అక్రమంగా తొలగించడం, నకిలీ ఓటర్లను చేర్చడం లాంటి అంశాలను యాత్రలో రాహుల్ గాంధీ ప్రజల దృష్టి తీసుకెళ్తున్నారు. ఒక వ్యక్తి-ఒక ఓటు అనే నినాదంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాజ్యాంగ పరిరక్షణ కోసం ఆయన పోరాటం చేస్తున్నారు.
ఓటర్ అధికార్ యాత్ర లైవ్: https://www.youtube.com/live/1yZtjAWYxes?si=BbACbIbFEKmTbCia






