- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Sindoor: మంత్రి జై శంకర్‌పై రాహుల్ ఆరోపణలు.. తోసిపుచ్చిన పీఐబీ
కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకునే ముందు పాకిస్థాన్‌కు భారత ప్రభుత్వం సమాచారం ఇవ్వడం నేరం అని విమర్శించారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకునే ముందు పాకిస్థాన్‌కు భారత ప్రభుత్వం సమాచారం ఇవ్వడం నేరం అని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్‌లో ఒక పోస్ట్ చేస్తూ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (Jai Shankar) ఈ విషయాన్ని బహిరంగంగా అంగీకరించినట్లు చెప్తున్న ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో జై శంకర్.. "మేం ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడి చేస్తున్నాం.. పాక్ సైన్యంపై దాడిచేయడం లేదు" అని చెప్తున్నట్లుగా ఉంది. రాహుల్ గాంధీ తన పోస్ట్‌లో, "ఈ చర్యకు అధికారం ఇచ్చింది ఎవరు? దీని వల్ల మన వైమానిక దళం ఎన్ని విమానాలను కోల్పోయింది?" అని ప్రశ్నించారు.
అయితే, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. జై శంకర్ అటువంటి వ్యాఖ్యలు చేయలేదని, ఈ క్లెయిమ్‌లు తప్పుడు సమాచారంపై ఆధారపడినవని పీఐబీ స్పష్టం చేసింది. ఏప్రిల్ 22, 2025న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి (Pahalgam Terror Attack) ప్రతిస్పందనగా భారత సైన్యం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)ను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ వివాదం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో రాజకీయ చర్చను మరింత రగిలించింది.






