- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rahul: ఒడిశాలో విద్యార్థిని ఆత్మహత్య.. బీజేపీపై రాహుల్ గాంధీ ఫైర్
ఒడిశాలో విద్యార్థిని తనకు తాను నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ స్పందించారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశాలో విద్యార్థిని తనకు తాను నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. ఈ ఘటనకు ఒడిశాలో అధికారంలో ఉన్న బీజేపీనే కారణమని ఆరోపించారు. బీజేపీ వ్యవస్థ చేసిన హత్యేనని అభివర్ణించారు. కాషాయ పార్టీ నిందితులను కాపాడుతుందని విమర్శించారు. విద్యార్థిని లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా తన స్వరాన్ని పెంచిందని, కానీ న్యాయం చేయడానికి బదులుగా, ఆమెను బెదిరించారు, హింసించారు, పదే పదే అవమానించారు. ఆమెను రక్షించాల్సిన వారే ఈ విధంగా ప్రవర్తించారు అని తెలిపారు. ‘మోడీ జీ ఒడిశాలో, మణిపూర్‌లో ఈ దేశ కుమార్తెలు కాలిపోతున్నారు. ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్న మీరెందుకు మౌనంగా ఉన్నారు. దేశానికి మీ నిశ్శబ్దం అవసరం లేదు. సమాధానాలు అవసరం’ అని పేర్కొన్నారు.
రాహుల్ ప్రకటనపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ చిల్లర రాజకీయాలు చేస్తు్న్నారని ఫైర్ అయ్యారు. విషాద ఘటనను రాజకీయాలు చేయడానికి ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. ఒడిశాలో జరిగిన సంఘటన దేశం మొత్తాన్ని కుదిపివేసిందని, కానీ కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాలను పెంచుకోవడానికి దీనిని అవకాశంగా మార్చుకుందని మండిపడ్డారు. కాగా, బాలాసోర్ లోని ఫకీర్ మోహన్ కళాశాలలో ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సు రెండో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని లైంగిక తనకు తానే నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రిన్సిపల్ వేధింపులే దీనికి కారణమని ఆరోపణలున్నాయి.






