రాహుల్ మొదట రాయ్ బరేలీ నుంచి గెలవాలి: చెస్ ప్లేయర్ గ్యారీ కాస్పరోవ్ పోస్ట్ వైరల్

by Dishanational2 |
రాహుల్ మొదట రాయ్ బరేలీ నుంచి గెలవాలి: చెస్ ప్లేయర్ గ్యారీ కాస్పరోవ్ పోస్ట్ వైరల్
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్, ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలీ నియోజకవర్గాల్లో పోటీ చేయడంపై రష్యా చెస్ ప్లేయర్ గ్యారీ కాస్పరోవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్ర స్థానానికి సవాల్ చేసే ముందు రాహుల్ మొదట రాయ్‌బరేలీ నుంచి గెలవాలని సంప్రదాయం చెబుతోంది అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అయితే ఇటీవల రాహుల్ గాంధీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసి..చదరంగం ఆటను రాజకీయాలతో పోల్చారు. తనకు ఏడేళ్ల వయసులో మొదట చదరంగం ఆడానని, తనకు ఆట నేర్పిన వ్యక్తిని ఓడించానని గుర్తు చేసుకున్నారు. అలాగే మోడీ పైనా పలు మార్లు రాహుల్ విరుచుకుపడ్డారు. దీంతో ఈ రెండు అంశాలకు సంబంధించిన వీడియోను కాస్పరోవ్ షేర్ చేస్తూ.. ముందు రాయ్ బరేలీలో గెలవండి అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా వైరల్‌గా మారాయి. దీనిపై కాస్పరోవ్ మరో పోస్టులో క్లారిటీ ఇచ్చారు. ‘ఇది జస్ట్ జోక్ మాత్రమే. ఈ జోక్ భారత రాజకీయాలపై ఏ మాత్రం ప్రభావం చూపబోదని ఆశిస్తున్నా. నన్ను1000 కళ్లతో ఉన్న రాక్షసుడు అని కూడా రాశారు. కాబట్టి రాజకీయ నాయకుడు తనకు ఇష్టమైన క్రీడలో ప్రయత్నించడాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను’ అని తెలిపారు.

Next Story

Most Viewed