- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈసీ వ్యాఖ్యలపై రాహుల్ సీరియస్
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన 'వోట్ చోరీ' ఆరోపణలు దేశంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన 'వోట్ చోరీ' ఆరోపణలు దేశంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే రాహుల్ ఆరోపణలపై నేడు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ సంఘం మీడియా సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చారు. పోలింగ్ బూత్స్ లో ఉన్న సీసీ టీవీ ఫుటేజీ ఇవ్వలేమని తేల్చి చెప్పారు. అలాగే రాహుల్ ఆరోపణలపై అఫిడవిట్ సమ్పరించాలని, లేదా దేశానికి క్షమాపణలు చెప్పాలని ఈసీ డిమాండ్ చేసారు. కాగా సీఈసీ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ సీరియస్ అయ్యారు.
ఈసీ నన్ను అఫిడవిట్ అడగటం కంటే ముందు నాలాంటి ఆరోపణలు నాకంటే ముందే చేసిన బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ ను ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. మహారాష్ట్ర ఎన్నికలను NDA క్లీన్ స్వీప్ చేయగా.. ఆ ఫలితాలపై కూడా తాము రీసెర్చ్ చేశామని, దాన్లో 4 నెలల్లో ఈసీ కోటి ఓట్లు చేర్చినట్టు గుర్తించామన్నారు. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మాకు వచ్చిన ఓట్లలో ఏమీ తేడా లేదన్నారు. కానీ కొత్తగా చేర్చిన కోటి ఓట్ల వల్లనే NDA గెలిచిందని ఆరోపించారు.
- Tags
- CEC
- Rahul gandhi






