- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాహుల్ గాంధీ ‘ఓట్ చోరీ’ ఆరోపణలు.. శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
లోక్‌సభా పక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కేంద్ర ఎన్నికల సంఘం (EC)తో పాటు, బీజేపీ (BJP)పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభా పక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కేంద్ర ఎన్నికల సంఘం (EC)తో పాటు, బీజేపీ (BJP)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో గురువారం ‘వోట్ చోర్ హై’ (‘Vote Chor Hai’) పేరుతో ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. బీజేపే, ఈసీ కుమ్మకై ఎన్నికల్లో ‘భారీ నేరపూరిత మోసానికి’ పాల్పడ్డాయని కామెంట్ చేశారు. ఇది ముమ్మాటికీ రాజ్యాంగ ద్రోహమని విమర్శించారు. ‘ఓట్ల చోరీ విధానం’ దేశవ్యాప్తంగా లోక్‌సభ, శాసనసభ ఎన్నికల సందర్భంగా అనేక నియోజకవర్గాల్లో కొనసాగిందని ఆక్షేపించారు. ఈ వ్యవహారంలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని కామెంట్ చేశారు.
ఈ నేపథ్యంలోనే కొన్నాళ్లుగా కాంగ్రెస్ హై కమాండ్‌తో అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్న ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ (Shashi Tharoor) తాజాగా రాహుల్ ఆరోపణలపై ‘X’ వేదికగా స్పందించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, ఎన్నికల సంఘం (EV) కుమ్మక్కై మోసం చేశారన్న రాహుల్ ఆరోపణను తాను కూడా సమర్ధిస్తున్నానని అన్నారు. అందుకు చాలా ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఈ విషయాన్ని భారతదేశంలోని అన్ని పార్టీలు, ఓటర్లు కూడా పరిగణలోకి తీసుకుని విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. భారత రాజ్యంగం చాలా విలువైనదని తెలిపారు. అసమర్థత, నిర్లక్ష్యం, ఉద్దేశపూర్వక జోక్యంతో దాని విశ్వసనీయతను నాశనం చేసే కుట్రలను అడ్డుకోవాలని శశి థరూర్ ట్వీట్ చేశారు.






