ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వంట బాగా చేస్తారు: Rahul Gandhi

by Disha Web Desk 2 |
ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వంట బాగా చేస్తారు: Rahul Gandhi
X

దిశ, వెబ్‌డెస్క్: రాజకీయాల్లో బిజీగా ఉంటూనే అప్పుడప్పుడు సరదాగా గడుపుతుంటారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. పిల్లలతో స్పోర్ట్స్ గేమ్స్ ఆడటం, యూట్యూబర్లతో ముచ్చటించడం వంటి ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి కూడా ఏవీ గోప్యంగా ఉంచకుండా సరదా సరదాగా చెప్పేస్తుంటారు. తాజాగా.. మరోసారి ఇలాంటి సరదా మాటలే మాట్లాడారు రాహుల్ గాంధీ. ఇటీవల ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ వంట బాగా చేస్తారని ప్రశంసించారు. కానీ, తనకు తల్లి సోనియా గాంధీ వంట అంటేనే ఎక్కువగా ఇష్టమని చెప్పుకొచ్చారు. సోనియా గాంధీ వంటచేస్తే తన చెల్లి ప్రియాంక గాంధీకి నచ్చదని ఫన్నీగా మాట్లాడారు. వంటల్లో తల్లి సోనియాకు నెంబర్ వన్ ప్లేస్, ప్రియాంకకు నెంబర్ 2 ప్లేస్ ఇస్తానని అన్నారు. ఉదయం సమయంలో కాఫీ, రాత్రి సమయంలో టీతో పాటు స్వీట్స్ తినేందుకు ఇష్టపడతానని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి :

చేతితో అన్నం తినడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో?

సమ్మర్ కధా అని నైటీలు ధరిస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే?

Next Story