- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేబినెట్‌లో చర్చించకుండా నిర్ణయం.. కేంద్రంపై రాహుల్ సీరియస్
కేబినెట్‌లో చర్చించకుండా నిర్ణయం.. కేంద్రంపై రాహుల్ సీరియస్

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(Congress Working Committee) సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం రాహుల్ గాంధీ(Rahul Gandhi) మీడియాతో మాట్లాడారు. ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకునేందుకు దేశ వ్యాప్తంగా పోరాటం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. గాంధీజీ పేరును తొలగించి జాతిపితను అవమానించారని మండిపడ్డారు. కేబినెట్‌లో పెట్టకుండా.. దీనిపై కనీసం చర్చ చేయకుండా పేరు మార్చారని సీరియస్ అయ్యారు. ఇది ప్రజాస్వామ్యమా? లేక రాచరిక వ్యవస్థా? అని తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. కేంద్రం పేదల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. పెట్టుబడిదారులను కాపాడేందుకు పేదల పొట్ట కొట్టే కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ప్రధాని మోడీకి గాంధేయ సిద్ధాంతాలంటే తీవ్రమైన వ్యతిరేకత ఉందని, అందుకే పేదల జీవనాధారమైన ఈ పథకాన్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని రాహుల్ ఆరోపించారు.
ఉపాధి హామీ పథకం కేవలం ఒక స్కీమ్ కాదని, అది గ్రామీణ స్వరాజ్యానికి ప్రతీక అన్నారు. కరోనా వంటి కష్టకాలంలో కోట్లాది కుటుంబాలను ఆదుకున్నది ఈ పథకమేనని గుర్తుచేశారు. కేంద్రం ప్రవేశపెట్టనున్న ‘వికసిత్ భారత్ గ్యారెంటీ’ (VB-G RAM G) బిల్లు ద్వారా రాష్ట్రాలపై 40 శాతం నిధుల భారం పడుతుందని, నిధులు అయిపోతే పని దొరకని పరిస్థితి ఏర్పడుతుందని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. అధికారాన్ని తన గుప్పెట్లో పెట్టుకునేందుకే మోడీ ఈ మార్పులు చేస్తున్నారని, గత పదేళ్లుగా ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ వచ్చారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజా వ్యతిరేక బిల్లును తీవ్రంగా ప్రతిఘటిస్తుందని రాహుల్ స్పష్టం చేశారు.
Read More..
కాంగ్రెస్ శ్రేణులు ప్రజా ఉద్యమానికి సిద్ధం అవ్వండి.. ఖర్గే కీలక వ్యాఖ్యలు






