- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘అప్పటివరకు విశ్రమించను’.. శపథం చేసిన రాహుల్ గాంధీ
కులగణనపై కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కులగణనపై కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఢిల్లీలో న్యాయ్ సమ్మేళన్ నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాహుల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కులగణన చేయకపోవడం చాలా తప్పు అని అన్నారు. ఆ తప్పును ఇప్పుడు తాము సరిదిద్దుతున్నామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కులగణన చేసే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో నిర్వహించిన కులగణన(Caste Census) దేశానికి రోల్ మోడల్ అన్నారు. ఇక దేశ వ్యాప్తంగా కులగణన నిర్వహించే వరకు తాము విశ్రమించబోమని చెప్పారు.
ఇది నా శపథం అని రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు. కావాలంటే.. ప్రియాంక గాంధీని అడగండి అని అన్నారు. దేశంలో ప్రతీ ఒక్కరికీ కలలు సాకారం చేసుకునే హక్కు ఉందని అన్నారు. రైతు కుమారుడు వ్యాపార వేత్త కావచ్చు.. కానీ.. అవకాశాలను అందిపుచ్చుకునే సామర్థ్యం ఉండాలని అన్నారు. తమ శక్తిని తెలుసుకోకపోవడమే కొందరి సమస్య అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో దళితుల చరిత్రను అర్ధం అంబేద్కర్ అర్ధం చేసుకున్నారు.. సమస్యను క్షుణ్ణంగా అర్ధం చేసుకున్నారు. ఆ దిశగా ప్రయత్నం చేసి.. దళితుల తలరాతలు మార్చారని కొనియాడారు. మరోవైపు.. భారత దేశ ఉత్పాదక శక్తికి ఓబీసీలు ప్రతీకలు అని అన్నారు.






