- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇందిరాగాంధీ ఎవరికీ భయపడలేదు.. ఆపరేషన్ సిందూర్‌పై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని భోపాల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు ప్రధాని మోడీ భయపడ్డారని విమర్శించారు. నరేందర్.. సరెండర్ అనగానే బెదిరిపోయాడని అన్నారు. ట్రంప్ భయంతోనే పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ ప్రకటించారని ఎద్దేవా చేశారు. గతంలో పాకిస్తాన్‌తో యుద్ధ సమయంలో ఇందిరా గాంధీ ఎవరికీ భయపడలేదని గుర్తుచేశారు. చైనా, పాకిస్తాన్‌కు భారత్ సత్తా ఏంటో ఆమె చూపించారని అన్నారు. సరెండర్ కావడం బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలకు అలవాటే అని తెలిపారు.
ఇదిలా ఉంటే.. ఇంతకుముందు కూడా ఆపరేషన్ సిందూర్‌పై రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌తోపాటు, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత సైన్యం దాడులు చేసి ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపింది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయడానికి ముందు.. కేంద్రం పాకిస్తాన్‌కు సమాచారం ఇచ్చినట్లు ఆరోపిస్తూ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలకు తెరతీశారు. ఈ ట్వీట్ దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఇది మరువక ముందే రాహుల్ ఇవాళ మరోసారి ఆపరేషన్ సిందూర్‌పై హాట్ కామెంట్స్ చేశారు.






