బీజేపీకి బీటీమ్‌గా పనిచేస్తున్నారు.. సొంత నేతలపై రాహుల్ గాంధీ ఫుల్ ఫైర్

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ పార్టీ(Congress Party) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీజేపీకి బీటీమ్‌గా పనిచేస్తున్నారు.. సొంత నేతలపై రాహుల్ గాంధీ ఫుల్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ(Congress Party) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన గుజరాత్(Gujarat) పర్యటనలో ఉన్నారు. అక్కడ పార్టీ ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంత పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్‌లో సగం మంది కాంగ్రెస్ నేతలు బీజేపీతో చేతులు కలిపారు. గుజరాత్‌లో బీజేపీకి బీటీమ్‌గా పనిచేస్తున్నారు. బీజేపీకి బీటీమ్‌గా పనిచేస్తున్న వారిని ఎవరీనీ వదలం.. అలాంటి వారందరనీ బయటకు పంపిచేస్తాం. కాంగ్రెస్‌లో నేతలకు కొదవ లేదు అని రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్ చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్‌కు 22 శాతం ఓట్లు పెరిగాయి.. అసాధ్యం అనుకున్న చోట వారు సాధించి చూపించారు. గుజరాత్‌లో కూడా కాంగ్రెస్‌కు 40 శాతం ఓటు బ్యాంక్ ఉన్నది.. కానీ అందుకు భిన్నంగా పనిచేస్తూ పార్టీ ప్రతిష్టను రోజురోజుకూ దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు.. అందరూ పార్టీ లైన్‌లో ఉండి పనిచేయాల్సింది.. గీత దాటిన వారిపై వేటు వేయడానికి ఎంతో సమయం పట్టదు.. ఇప్పుటికైనా మించిపోయిందేం లేదు. వైఖరి మార్చుకొని పార్టీ కోసం పనిచేయాలని తీవ్రంగా హెచ్చరించారు.

Next Story