India Pakistan War: ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ లేఖ.. ఏం రాసారంటే?

by Yella Dhawani Reddy |

భారత్, పాక్ (India-Pakistan ceasefire) దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే.

India Pakistan War: ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ లేఖ.. ఏం రాసారంటే?
X

దిశ, వెబ్ డెస్క్: భారత్, పాక్ (India-Pakistan ceasefire) దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi)కి కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul gandhi) లేఖ రాశారు. ప్రస్తుతం దేశంలోని పరిస్థితులు, జాతీయ భద్రతా పరిణామాలపై చర్చించేందుకు పార్లమెంటులో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఆ లేఖలో కోరారు. సమావేశంలో పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుగా దీనిపై ప్రకటన చేయడం వంటి అంశాలపై సమావేశంలో చర్చ జరపాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇది ప్రతిపక్షాల ఉమ్మడి రిక్వెస్ట్ అని తెలిపారు. ప్రస్తుతం మనముందున్న సవాళ్లను ఎదుర్కోడానికి, సమిష్టి సంకల్పాన్సి ప్రదర్శించడానికి ఈ సమావేశం ఒక అవకాశంగా రాహుల్‌ పేర్కొన్నారు.

Next Story