- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీకి చేరిన రాహుల్ గాంధీ Bharat Jodo Yatra!
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శనివారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీలో అడుగుపెట్టింది.

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శనివారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీలో అడుగుపెట్టింది. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అనిల్ చౌదరి, పార్టీ కార్యకర్తలు రాహుల్ గాంధీకి బందర్ పూర్ సరిహద్దు వద్ద ఘన స్వాగతం పలికారు. ఈ యాత్ర ఢిల్లీలోకి ప్రవేశించిన సందర్భంగా రాహుల్ వెంట సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇవాళ్టి యాత్రలో కాంగ్రెస్ ఎంపీలు కూడా హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని ఆశ్రమ చౌక్ వద్ద రాహుల్ యాత్ర ఆగనుంది. తిరిగి మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభం కానుంది. మధుర రహదారి, ఇండియా గేట్, ఐటీఓ గుంటా యాత్ర కొనసాగి ఎర్రకోట వద్ద ఇవాళ్టి యాత్ర ముగుస్తుంది.
దేశంలో మరోసారి కరోనా పరిస్థితులు ఆందోళనకరంగా మారడంతో కోవిడ్ రూల్స్ పాటించాలని లేకుంటే యాత్రను నిలిపివేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ రాహుల్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఈ యాత్రను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రాహుల్ యాత్రపై పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాహుల్ ఎక్కడ పర్యటిస్తే అక్కడ కాంగ్రెస్ ఖతం అవుతుందని విమర్శించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయ చెప్పినట్టు మార్గదర్శకాలు పాటిస్తే తమకేమీ అభ్యంతరం లేదన్నారు. భారత్ జోడో యాత్రకు వస్తున్న ఆదరణ చూసి బీజేపీ బయపడుతోందన్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
Also Read..
రేవంత్ రెడ్డిపై మరోసారి Marri Shasidhar Reddy కీలక వ్యాఖ్యలు






