- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతిపక్ష నేత అంటే రబ్బర్ స్టాంప్ కాదు: రాహుల్ గాంధీ
by velandi.Saikiran |
సీబీఐ డైరెక్టర్ ఎంపిక ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారని విమర్శలు చేస్తూ లేఖ రాశారు రాహుల్ గాంధీ.

X
దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ. సీబీఐ డైరెక్టర్ ఎంపిక ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారని విమర్శలు చేస్తూ లేఖ రాశారు. సీబీఐ వ్యవస్థను కేంద్ర సర్కార్ దుర్వినియోగం చేస్తోందని ఆగ్రహించారు. ఇలా సంస్థలను అదుపు చేయకూడదని LOP ని సెలక్షన్ కమిటీలో ఉంచారని గుర్తు చేశారు.
కానీ తాను ఎన్నిసార్లు అడిగినా, అభ్యర్థుల సమాచారం ఇవ్వడం లేదని సీరియస్ అయ్యారు. ఈ పక్షపాత పూరిత ప్రక్రియలో తాను పాల్గొనలేనని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత అంటే రబ్బర్ స్టాంప్ కాదని ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. న్యాయ బద్ధంగా మోడీ సర్కార్ వ్యవహరించాలని లేఖలో పేర్కొన్నారు. కాగా మే 24వ తేదీన సీబీఐ చీఫ్ ప్రవీణ్ రిటైర్ కాబోతున్నారు.
Next Story






