BREAKING: లోక్ సభ ఎన్నికల్లో దుమ్మురేపిన రాహుల్ గాంధీ.. పోటీ చేసిన రెండు చోట్ల ఘన విజయం

by Satheesh |

దేశంలో పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. అధికార ఎన్డీఏ కూటమి, ప్రతిపక్ష ఇండియా కూటమి హోరాహోరీగా

BREAKING: లోక్ సభ ఎన్నికల్లో దుమ్మురేపిన రాహుల్ గాంధీ.. పోటీ చేసిన రెండు చోట్ల ఘన విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. అధికార ఎన్డీఏ కూటమి, ప్రతిపక్ష ఇండియా కూటమి హోరాహోరీగా తలపడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఇండియా కూటమి ఊహించని రేంజ్‌లో పుంజుకుని బీజేపీ నేతృత్వలోని ఎన్డీఏ కూటమికి టఫ్ ఫైట్ ఇస్తోంది. బీజేపీ దేశంలో సింగల్ లార్జెస్ట్ పార్టీ అవతరించినా.. ఇండియా కూటమి దెబ్బతో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ (272)కు రీచ్ కాలేపోతుంది. ఈ పరిణామాలతో 2024 లోక్ సభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. గత రెండు (2014, 2019) పర్యాయాలు సొంత మేజిక్ ఫిగర్ సాధించి సెంట్రల్‌లో గవర్నమెంట్ ఫామ్ చేసిన బీజేపీకి ఈ సారి మాత్రం గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి.

ఇక, ఇదిలా ఉంటే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో సత్తా చాటారు. గతంలో రెండు చోట్లో పోటీ చేసి వయనాడ్‌లో గెలిచిన రాహుల్.. అనూహ్యంగా కాంగ్రెస్ కంచుకోట ఆమేథీలో మాత్రం ఓటమి పాలయ్యారు. దీంతో రాహుల్ ఈసారి సిట్టింగ్ సీటు అయిన వయనాడ్‌తో పాటు రాయ్ బరేలి నుండి బరిలోకి దిగారు. ఈ రెండు స్థానాల్లో రాహుల్ గాంధీ ఘన విజయం సాధించారు. వయనాడ్‌‌లో సీపీఐ అభ్యర్థిపై లక్ష ఓట్లకు పై చిలుకు మెజార్టీతో గెలుపొందంగా.. రాయే బరేలిలో బీజేపీ అభ్యర్థి దినేష్ రావుపై ఘన విజయం సాధించారు.

Next Story