చెరువులో దిగి చేపలు పట్టిన రాహుల్ గాంధీ

by Muthe.Rajitha |

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల ప్రచారంలో బిజీ, బిజీగా గడుపుతున్నారు.

చెరువులో దిగి చేపలు పట్టిన రాహుల్ గాంధీ
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల ప్రచారంలో బిజీ, బిజీగా గడుపుతున్నారు. అయితే ఎక్కడికి వెళ్లినా అక్కడి ప్రాంత ప్రజలతో మమేకం అవడం రాహుల్ ప్రత్యేకత. కాగా నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా బెగుసరాయ్ లో పర్యటిస్తూ.. స్థానిక జాలర్లతో చెరువులో దిగి సందడి చేసారు. స్థానికంగా అక్కడి జాలర్లు చేపలు పడుతుండటం చూసిన రాహుల్.. చెరువులో దూకి, ఈదుకుంటూ వారివద్దకు వెళ్ళాడు. వారితో కలిసి చెరువులో చేపలు పడుతూ ముచ్చటించారు.

వారితో ఫోటోలు కూడా దిగారు. అయితే రాహుల్ తోపాటు డిప్యూటీ సీఎం అభ్యర్థి ముఖేష్ సహానీ, కన్హయ్య కుమార్ కూడా చెరువులోకి దిగారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story