- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rahul gandhi: ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ
హర్యానా, మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల డేటాను పంచుకోవాలనే ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ స్వాగతించారు.

దిశ, నేషనల్ బ్యూరో: 2009, 2024 మధ్య హర్యానా (Haryana), మహారాష్ట్ర (Maharashtra) లో జరిగిన ఎన్నికల డేటాను పంచుకోవాలనే ఎన్నికల కమిషన్ (Election commission) నిర్ణయాన్ని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul gandhi) స్వాగతించారు. ఇది మంచి పరిణామమని అయితే ఈ డేటాను రాజకీయ పార్టీలకు ఏ తేదీన అందజేస్తారో చెప్పగలరా అని ప్రశ్నించారు. ఈ మేరకు రాహుల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘ఎన్నికల సంఘం ఓటర్ లిస్ట్ అందజేయడం మంచిదే. అయితే ఈ డేటా డిజిటల్, మెషిన్-రీడబుల్ ఫార్మాట్‌లో ఎప్పుడు అందజేస్తారో ఈసీ ప్రకటించగలదా?’ అని పేర్కొన్నారు. హర్యానా, మహారాష్ట్ర ఓటర్ల జాబితాను పొలిటికల్ పార్టీలకు ఇవ్వాలని ఎన్నికల సంఘం నిర్ణయించినట్టు తెలిపే ఓ నివేదికను సైతం రాహుల్ పోస్ట్ చేశారు. కాగా, 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని రాహుల్ గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే.






