Rahul Gandhi: పూంఛ్ ప్రాంతంలో పర్యటించి విద్యార్థులతో మాట్లాడిన రాహుల్

by Shamantha N |

కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పూంఛ్‌ ప్రాంతంలో పర్యటించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి.

Rahul Gandhi: పూంఛ్ ప్రాంతంలో పర్యటించి విద్యార్థులతో మాట్లాడిన రాహుల్
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పూంఛ్‌ ప్రాంతంలో పర్యటించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. పాక్ షెల్లింగ్ లో జమ్ముకశ్మీర్‌ సరిహద్దు గ్రామాలు దెబ్బతిన్నాయి. పాక్‌ దాడుల కారణంగా పూంఛ్‌ ప్రాంతంలోని ప్రజలు ఎక్కువగా ప్రభావితమయ్యారు. 25 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా నివాసాలు ధ్వంసం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే రాహుల్ శనివారం అక్కడ పర్యటించారు. బాధితులను కలిసి క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా, బ్బతిన్న గృహాలను పరిశీలించారు. ఈ పర్యటన సందర్భంగా ఆ ప్రాంతంలోని ఒక పాఠశాలకు రాహుల్‌ వెళ్లి అక్కడి విద్యార్థులతో మాట్లాడారు. రాహుల్ మాట్లాడుతూ.. "ఇప్పుడు, మీరు ప్రమాదాన్ని, కొంచెం భయానక పరిస్థితిని చూశారు. కానీ చింతించకండి. ప్రతిదీ సాధారణ స్థితికి వస్తుంది. ఈ సమస్యకు మీరు స్పందించే విధానం ఏమిటంటే మీరు చదువుకోవడం, ఆడుకోవడం. పాఠశాలలో చాలా మంది స్నేహితులను సంపాదించుకోవడం" అని ఆయన వారికి చెప్పారు.

భారీ నష్టం..

రాహుల్ తన పర్యటన గురించి మీడియాతో మాట్లాడారు. సరిహద్దు ప్రాంతాల్లో "భారీ నష్టం" జరిగిందని అన్నారు. రాహుల్ మాట్లాడుతూ.. "నేను ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఈ విషయాన్ని జాతీయ స్థాయిలో లేవనెత్తాలని వారు నన్ను అభ్యర్థించారు. నేను అలాగే చేస్తాను" అని అన్నారు. ఇక, పహెల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి.. పాక్ లోని 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. ఆ తర్వాత పాక్ భారత్ పై డ్రోన్లు, మిస్సైల్స్ తో దాడి చేసింది. భారత బలగాలు వాటిని సమర్థంగా తిప్పికొట్టాయి. అప్పట్నుంచి ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.

Next Story