- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మా బావను పదేళ్లుగా ఈ ప్రభుత్వం వేధిస్తోంది : రాహుల్ సంచలన ట్వీట్
రాబర్ట్ వాద్రా(Robert Vadra)పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన తాజా ఛార్జిషీట్ పై రాహుల్ గాంధీ స్పందించారు.

దిశ, వెబ్ డెస్క్ : రాబర్ట్ వాద్రా(Robert Vadra)పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన తాజా ఛార్జిషీట్ పై రాహుల్ గాంధీ స్పందించారు. ఈ మేరకు రాహుల్ గాంధీ నేడు తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. తన బావమరిది రాబర్ట్ వాద్రాపై ఈడీ దాఖలు చేసిన తాజా ఛార్జిషీట్‌ను రాజకీయ ప్రేరేపిత వేధింపులకు కొనసాగింపుగా విమర్శించారు. గత పదేళ్లుగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వాద్రాను వేధిస్తోందని ఆరోపించారు. తన సోదరి ప్రియాంకా గాంధీ, వాద్రా, వారి పిల్లలు ఈ సవాళ్లను ధైర్యంగా, గౌరవంగా ఎదుర్కొంటారని పేర్కొన్నారు. వారికి నేను మద్ధతుగా నిలబడతానని, చివరికి సత్యం నెగ్గుతుందని ట్వీట్ చేశారు.
ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ హరియాణాలోని గురుగ్రామ్‌లోని షికోపూర్ గ్రామంలో 2008లో జరిగిన 3.53 ఎకరాల భూ లావాదేవీలోని మనీలాండరింగ్ కేసుకు సంబంధించినది. ఇందులో రాబర్ట్ వాద్రా సంస్థ స్కైలైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు ఇతర వ్యక్తులు, సంస్థలు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఈ కేసులో వాద్రాకు చెందిన రూ. 37.64 కోట్ల విలువైన 43 ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.






