- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rahul Gandhi :రేపు జమ్మూకశ్మీర్ కు రాహుల్ గాంధీ
జమ్మూకాశ్మీర్లోని పహల్గంలో మంగళవారం ఉగ్రవాదులు దాడి(Pahalagam Terror Attack) చేసి 26 మంది అమాయకులను బలి తీసుకున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : జమ్మూకాశ్మీర్లోని పహల్గంలో మంగళవారం ఉగ్రవాదులు దాడి(Pahalagam Terror Attack) చేసి 26 మంది అమాయకులను బలి తీసుకున్న విషయం తెలిసిందే. భారత్ తో పాటు ప్రపంచాన్ని కుదుపు కుదిపేసిన ఈ ఘటనను ప్రతీ ఒక్కరూ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో గాయపడి అనంత్ నాగ్ లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు జమ్మూకశ్మీర్(Jammu Kashmir Tour) వెళ్లనున్నారు లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi). అయితే అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ ఘటన విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన భారత్ చేరుకున్నారు. ఉగ్రదాడిపై తదుపరి కార్యచరణ రచించడానికి రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యర్యంలో గురువారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం(All-Party Meeting)లో రాహుల్ పాల్గొన్నారు.
ఉగ్రవాద నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమ సంపూర్ణ మద్ధతు ఉంటుందని సమావేశంలో రాహుల్ పేర్కొన్నట్టు సమాచారం. మరోవైపు పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనుందని తెలుస్తోంది. అన్ని రాష్ట్రాల్లోనూ ఈ ర్యాలీలు జరగనున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పేర్కొన్నారు. నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఉగ్రదాడి మృతులకు నివాళులు తెలుపుతూ.. 2 నిముషాల మౌనం పాటించారు. ఇక ఈనెల 25, 26 తేదీల్లో కాంగ్రెస్ నిర్వహించనున్న అన్ని కార్యక్రమాలు 27వ తేదీకి వాయిదా వేస్తూ ఏఐసీసీ వర్గాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.






