Rahul Gandhi : వారికి అమరవీరుల హోదా ఇవ్వాలి.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ

by B.Srinivas |

పహెల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి అమరవీరుల హోదా ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ పత్రిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు.

Rahul Gandhi : వారికి అమరవీరుల హోదా ఇవ్వాలి.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌ (Jammu kashmir) లోని పహెల్గాం (Pahelgam) లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారికి అమరవీరుల హోదా ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ పత్రిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul gandhi) ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని వారి డిమాండ్ కు పూర్తిగా మద్దతిస్తానని తెలిపారు. ఈ మేరకు గురువారం ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు దు:ఖంలో ఉన్నాయి. ఈ టైంలో వారికి అండగా నిలుస్తున్నా. మరణించిన వారికి అమరవీరుల హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వారి మనోభావాలను పరిగణనలోకి తీసుకుని ఈ స్టేటస్ ఇవ్వాలి. ఈ విషయంలో ప్రధాని మోడీ (Modi) చొరవ తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉండాలని సూచించారు. అంతకుముందు రాహుల్ గాంధీ పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించిన విషయం తెలిసిందే.

Next Story