- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పార్లమెంట్‍లో హై వోల్టేజ్ పాలిటిక్స్.. మమతా పార్టీ తీరుపై రాహుల్ తీవ్ర అభ్యంతరం
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ముంగిట నిన్న ఇండియా కూటమి కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో టీఎంసీ అభ్యర్థన పట్ల రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టేందుకు ఇవాళ్టి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ వంటి కీలకమైన బిల్లులను పార్లమెంట్‍లో ప్రభుత్వం ఇవాళ ప్రవేశపెట్టింది. అయితే ఇవాళ పార్లమెంట్ సమావేశం నేపథ్యంలో నిన్న ఢిల్లీలోని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి కీలక సమావేశం నిర్వహించింది. ఆ కూటమిలోని పార్టీలు ఈ మీటింగ్‍కు అటెండ్ అయి సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ విజ్ఞప్తిపై ఏఐసీసీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
ఇది ఆమోదయోగ్యం కాదు:
ఇండియా కూటమి భేటీలో టీఎంసీ కీలక విజ్ఞప్తిని కూటమి పార్టీ నేతల ముందు ఉంచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పశ్చిమబెంగాల్ శాసనసభకు ఎన్నికలు జరగబోతున్నందునా అక్కడ ప్రచారం కీలక దశలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రత్యేక సమావేశాలకు తమ ఎంపీలు 100 శాతం హాజరు నిర్దారించడం కష్టం అని తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ రాజ్యసభ డిప్యూటీ లీడర్ సాగరికా ఘోష్ ప్రస్తావించగా, టీఎంసీ విజ్ఞప్తిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. ఓటింగ్ సమయంలో ప్రతిపక్ష ఎంపీలు గైర్హాజరు కావడం అంటే పరోక్షంగా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడమేనని రాహుల్ గాంధీ స్పష్టం చేశారని ఇది అస్సలు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసినట్లు జాతీయ మీడియాలో కథనాసలు వచ్చాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ ఐక్యంగా ఉండి, ఓటింగ్ ద్వారా ఈ బిల్లులను ఓడించాలి అని ఆయన అప్రమత్తం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే టీఎంసీ వైఖరి పట్ల ఇదే సమావేశంలో డీఎంకే నేత టీఆర్ బాలు సైతం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వచ్చే వారం తమిళనాడులోనూ ఎన్నికలు ఉన్నప్పటికీ తమ ఎంపీలందరూ హాజరవుతారని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఇవాళ లైన్ క్లియర్:
కాగా131 రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టడంపై లోక్‌సభలో గురువారం ఓటింగ్ జరిగింది. డీలిమిటేషన్ బిల్లులపై చర్చకు విపక్షాలు డివిజన్ కోరాయి. అందుకు స్పీకర్ ఓం బిర్లా అంగీకరించడంతో ఓటింగ్ నిర్వహించారు. సభలో ఉన్న మొత్తం 333 మంది ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొనగా అనుకూలంగా 207 రాగా వ్యతిరేకంగా 126 మంది ఓటు వేశారు. మరో 86 మంది సభకు హాజరే కాలేదు. దీంతో డీలిమిటేషన్ బిల్లులపై సభలో చర్చకు మార్గం సుగమమైంది. దీంతో ఇవాళ ఓటింగ్‍కు హాజరు కాని సభ్యులు అధికార పక్షమా? విపక్షమా అనేది తెలాల్సి ఉంది.






