- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చకు స్పీకర్ ఆమోదం.. రేపు సాయంత్రం 4 గంటలకు మూడు బిల్లులపై ఓటింగ్
లోక్‌సభలో ఉద్రిక్తతల మధ్య 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చ ప్రారంభమైంది. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బిల్లును ప్రవేశపెట్టగా, హోంమంత్రి అమిత్ షా డీలిమిటేషన్ బిల్లును సభ ముందుంచారు

దిశ, వెబ్‌డెస్క్: ఉద్రిక్తతల నడుమ లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై, స్పీకర్ ఓం బిర్లా అనుమతితో కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ (Arjun Ram Meghwal) చర్చను ప్రారంభించారు. మరోవైపు డీలిమిటేషన్ బిల్లుతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో పునర్విభజన బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) సభలో ప్రవేశపెట్టారు. ఇక రాజ్యాంగ సవరణ బిల్లులోని సమగ్ర అంశాలను అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో క్షుణ్ణంగా ప్రస్తావిస్తున్నారు. ఈ క్రమంలోనే రాజ్యాంగ సవరణలను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నాయి. లోక్‌సభలో దాదాపు 12 గంటల పాటు బిల్లులపై చర్చ ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. అవసరమైతే, స్పీకర్ ఆ సమయాన్ని పొడిగించవచ్చని స్పష్టం చేశారు. అనంతరం స్పీకర్ ఓం బిర్లా (Om Birla) మాట్లాడుతూ.. మూడు బిల్లులపై రేపు సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ ఉంటుందని సభ్యులకు తెలిపారు.






