బీజేపీ హయాంలో దళితులపై పెరిగిన నేరాలు

by Ajay Maddhiboyina |

బీజేపీ హయాంలో దళితులపై నేరాలు, దౌర్జన్యాలు, అత్యాచారాలు పెరిగిపోయాయని ఆరోపించారు. ఈ నేరాలను యూపీలో పట్టించుకునే నాథుడే లేడని వాపోయారు.

బీజేపీ హయాంలో దళితులపై పెరిగిన నేరాలు
X

- దళిత మహిళ హత్య అమానవీయం, క్రూరం

- అధికారులు ముందే స్పందించి ఉంటే ఆమె రక్షించబడేది

- యూపీ ప్రభుత్వంపై ఫైర్ అయిన రాహుల్ గాంధీ

దిశ, నేషనల్ బ్యూరో:

అయోధ్యలో దళిత యువతి దారుణ హ్యత నిజంగా అమానవీయం, క్రూరమైనదని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ఈ ఘటన హృదయ విదారకంగా ఉండటమే కాకుండా సమాజం సిగ్గుపడేలా ఉందని రాహుల్ అన్నారు. యువతి తప్పిపోయిన తర్వాత కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన వినతికి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఉంటూ తప్పకుండా ఆమె బతికి ఉండేదని చెప్పారు. బీజేపీ హయాంలో దళితులపై నేరాలు, దౌర్జన్యాలు, అత్యాచారాలు పెరిగిపోయాయని ఆరోపించారు. ఈ నేరాలను యూపీలో పట్టించుకునే నాథుడే లేడని వాపోయారు. యూపీ ప్రభుత్వం వెంటనే ఈ దారుణ సంఘటనపై వెంటనే విచారణ జరిపి నేరస్తులకు శిక్ష పడేలా చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. అలాగే ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని అన్నారు.

అయోధ్యలోని దళిత కుటుంబానికి చెందిన ఓ యువతి (22) జనవరి 30న మతపరమైన కార్యక్రమానికి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. వెంటనే కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. కాగా, శనివారం సదరు యువతి మృతదేహం కాలువ పక్కన నగ్నంగా పడిఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. యువతి కళ్లను కూడా పెకిలించారని, ఎముకలు విరిగిపోయి ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా, యువతిపై సామూహిక లైంగిక దాడి జరిగి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

కన్నీళ్లు పెట్టుకున్న ఎంపీ..

యువతి హత్య విషయం తెలుసుకున్న ఫైజాబాద్ ఎస్పీ ఎంపీ అవదేశ్ ప్రసాద్ బాధితురాలి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. ఈ దారుణ సంఘటనపై మీడియాతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. నేను ప్రజాప్రతినిధిగా ఉండటానికి అనర్హుడిని.. ఒక యువతిని రక్షించలేకపోయాను అంటూ ఏడ్చేశారు. తాను త్వరలోనే ఢిల్లీ వెళ్లీ పీఎం మోడీతో ఈ విషయంపై చర్చిస్తాను. యువతి కుటుంబ సభ్యులకు న్యాయం జరగకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని అవదేశ్ ప్రసాద్ చెప్పారు.

కాగా, ఈ సంఘటనపై సమాజ్‌వాది పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ స్పందించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే యువతి హత్య జరిగిందని ఆరోపించారు. యువతి కుటుంబానికి రూ.1 కోటి పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

Next Story