పాలించడం చేతకాదని బీజేపీ ఒప్పుకుంది

by Ajay Maddhiboyina |

జాతుల మధ్య హింస చెలరేగిన మణిపూర్‌లో పాలించడం చేత కాలేదని బీజేపీ కాస్త ఆలస్యంగానైనా అంగీకరించిందని రాహుల్ గాంధీ విమర్శించారు.

పాలించడం చేతకాదని బీజేపీ ఒప్పుకుంది
X

- మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనపై రాహుల్ వ్యాఖ్య

దిశ, నేషనల్ బ్యూరో: ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించడంపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. జాతుల మధ్య హింస చెలరేగిన మణిపూర్‌లో పాలించడం చేత కాలేదని బీజేపీ కాస్త ఆలస్యంగానైనా అంగీకరించిందని రాహుల్ గాంధీ విమర్శించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తనకు ఉన్న అధికారాన్ని వినియోగించి మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. ఆ కాసేపటికే 'ఎక్స్' వేదికగా రాహుల్ గాంధీ స్పందించారు. 'మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించడం అంటే ఆ రాష్ట్రాన్ని పాలించడంలో తమ పూర్తి అసమర్థతను బీజేపీ ఆలస్యంగానైనా అంగీకరించడమే. ఇకపై ప్రధాని మోడీ మణిపూర్‌పై తనకు ఉన్న బాధ్యతను విస్మరించలేరు. ఇప్పటికైనా ఆయన మణిపూర్‌ను సందర్శించి.. శాంతిని నెలకొల్పి సాధారణ స్థితికి తీసుకొని వస్తారా? ఈ విషయంలో తన ప్రణాళికలను దేశానికి వివరించాలని భావిస్తున్నారా?' అంటూ ఎక్స్‌లో రాసుకొని వచ్చారు.

Next Story