- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మోడీజీ దీనిపై దృష్టి పెట్టండి.. వీడియో షేర్ చేసిన రాహుల్ గాంధీ
భారత్ పై అమెరికా విధిస్తున్న సుంకాలతో వస్త్ర పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని ప్రధాని మోడీ మాట్లాడాలంటూ కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: భారత్ పై అమెరికా విధిస్తున్న సుంకాలతో వస్త్ర పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని ప్రధాని మోడీ మాట్లాడాలంటూ కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశారు. వీడియోలో రాహుల్ గాంధీ వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులతో మాట్లాడారు. పలు విషయాలను వారితో చర్చించారు. అమెరికా విధిస్తున్న 50శాతం సుంకాలు, అనిశ్చితి భారతదేశ వస్త్ర ఎగుమతిదారులను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. ఆర్డర్లు తగ్గడంతో ఉద్యోగాల కోత, ఫ్యాక్టరీల మూసివేత మన డెడ్ ఎకానమీని సూచిస్తున్నాయని తెలిపారు. 4.5 కోట్లకు పైగా ఉద్యోగాలు, లక్షలాది వ్యాపారాలు ప్రమాదంలో ఉన్నప్పటికీ మోడీ ఎలాంటి ఉపశమనం కల్పించడం లేదన్నారు. సుంకాల గురించి మాట్లాడటం లేదని తెలిపారు. మోడీ జవాబుదారిగా ఉండాలని ఈ విషయంపై దృష్టి పెట్టాలని రాహుల్ కోరారు.






