ఎన్నికల అధికారులే దొంగలకు సహకరిస్తున్నారు.. రాహుల్ విమర్శలు

by Phanindra |

ఎన్నికల అధికారులే దొంగలకు సహకరిస్తున్నారని, ఓటు చోరీ చేయిస్తున్నారని విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.

ఎన్నికల అధికారులే దొంగలకు సహకరిస్తున్నారు.. రాహుల్ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానాలో ఓటు చోరీ జరిగిందని తాను సాక్షాలతో నిరూపించానని, ఒక రాష్ట్రంలో అధికారాన్ని ఎలా దొంగిలించారో వివరించానని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ తెలిపారు. అలాగే బిహార్‌లో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)తో ఓటర్ల జాబితాలో ఎలా మార్పులు చేస్తున్నారో వివరిస్తూ తాను ‘ఓటర్ అధికార్ యాత్ర’ కూడా చేపట్టానని గుర్తుచేశారు. బిహార్ తొలి దశ ఎన్నికల్లో మారుమూల ప్రాంతాల నుంచి కూడా వస్తున్న వీడియోలో ‘ఓటు చోరీ’ జరుగుతుందనడానికి మరింత ఊతమిస్తున్నాయన్నారు. ఎన్నికలకు ముందే లక్షలాది మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారని, ఇప్పుడు పలుచోట్ల ప్రజలను ఓట్లు కూడా వేయనివ్వడం లేదని విమర్శించారు. అదే సమయంలో వేరే రాష్ట్రాల్లో ఓట్లు వేసిన కొందరు బీజేపీ నేతలు, కార్యకర్తలు బిహార్‌లో కూడా ఓట్లేస్తున్నారని విమర్శించారు. ఇలా ఓటు చోరీతో ఏర్పాటైన ప్రభుత్వాలు ఎప్పుడూ యువకులు, జెన్ జీ, ఇతర ప్రజల కోసం పనిచేయదన్నారు. ఇలా ప్రజాస్వామ్యం ఖూనీ జరగడానికి బాధ్యులు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లయిన జ్ఞానేశ్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంఘూ, వివేక్ జోషీనే అని ఆయన ఆరోపించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించే బాధ్యత తీసుకున్న వీళ్లే.. ప్రజల భవిష్యత్తును దొంగిలించడలో భాగస్వాములవుతున్నారని విమర్శించారు.

Next Story