బుల్లెట్ గాయానికి బ్యాండ్‌ఎయిడ్ వేసినట్లుంది.. బడ్జెట్‌పై రాహుల్ గాంధీ సెటైర్

by Gantepaka Srikanth |   (  Updated:2025-02-01 11:12:15  IST  )

కేంద్ర బడ్జెట్‌(Union Budget-2025)పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పందించారు.

బుల్లెట్ గాయానికి బ్యాండ్‌ఎయిడ్ వేసినట్లుంది.. బడ్జెట్‌పై రాహుల్ గాంధీ సెటైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర బడ్జెట్‌(Union Budget-2025)పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పందించారు. బుల్లెట్ గాయాలకు బ్యాండ్‌ఎయిడ్ చికిత్సలా బడ్జెట్ ఉందని ఎద్దేవా చేశారు. ఆర్థిక సంక్షోభంపై బడ్జెట్‌లో ఎలాంటి చర్యలు లేవని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి అన్ని వర్గాలను మోసం చేసిందని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. మరోవైపు.. దేశ ఆర్థిక ప్రగతిలో ఎంతో కీలకమైన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ప్రవేశపెట్టారని బీజేపీ(BJP) నేతలు స్పందిస్తున్నారు. 140 కోట్ల ప్రజల ఆశలు నెరవేర్చే బడ్జెట్ అని బీజేపీ కొనియాడింది. దేశాన్ని వికసిత్ భారత్‌ వైపు అడుగులు వేయిస్తుందని పేర్కొంది.

ఇది 140 కోట్ల ప్రజల ఆశలు నెరవేర్చే బడ్జెట్ అని ప్రధాని మోడీ(PM Modi) కొనియాడారు. దీంతో పొదుపు, పెట్టుబడులు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పద్దు దేశాన్ని వికసిత్ భారత్‌ వైపు అడుగులు వేయిస్తుందని పేర్కొన్నారు. అనేక రంగాల్లో యువతకు అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపారు. దేశ చరిత్రలో ఈ బడ్జెట్‌ ఒక ముఖ్యమైన మైలురాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) అభిప్రాయపడ్డారు. ఈ బడ్జెట్‌ ప్రతి భారతీయుడి కల నెరవేర్చుతుందని తెలిపారు. అనేక రంగాల్లో యువతకు అవకాశాలను కల్పిస్తున్నాం. బడ్జెట్‌లు సాధారణంగా ఖజానాను నింపడంపై దృష్టి సారిస్తాయి. కానీ ఈ బడ్జెట్‌ మాత్రం ప్రజల జేబులు నింపేందుకు, సేవింగ్స్‌ పెంచేందుకు ఉద్దేశించింది అని ప్రధాని మోడీ, అమిత్ షా అభిప్రాయపడ్డారు.


Also Read...

Disha Special: భారతదేశాన్ని మలుపుతిప్పిన అత్యంత ముఖ్యమైన బడ్జెట్లు

Next Story