- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రధాని మోడీ ఓకే అంటే నేను రెడీ : రాహుల్‌గాంధీ
by Hajipasha |
దిశ, నేషనల్ బ్యూరో : ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఓపెన్ డిబేట్‌లో పాల్గొనాలంటూ మాజీ న్యాయమూర్తులు మదన్ బి.లోకూర్, అజిత్.పి.షా, సీనియర్ జర్నలిస్ట్ ఎన్.రామ్ రాసిన లేఖపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పందించారు.

X
దిశ, నేషనల్ బ్యూరో : ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఓపెన్ డిబేట్‌లో పాల్గొనాలంటూ మాజీ న్యాయమూర్తులు మదన్ బి.లోకూర్, అజిత్.పి.షా, సీనియర్ జర్నలిస్ట్ ఎన్.రామ్ రాసిన లేఖపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పందించారు. ఆ చారిత్రాత్మక చర్చలో పాల్గొనేందుకు తాను ఆతురతగా ఎదురు చూస్తున్నానని ఆయన వెల్లడించారు. ఈ డిబేట్‌లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ అంగీకారం తెలిపితే నిర్వాహకులు తనకు వెంటనే తెలియజేయాలని.. తప్పకుండా చర్చా కార్యక్రమానికి హాజరవుతానన్నారు. ఈ ఆహ్వానం గురించి తాను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో చర్చించానని వెల్లడించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన రాజకీయ పక్షాల ప్రతినిధుల వాణిని ప్రజలు నేరుగా వినేందుకు ఈ పబ్లిక్ డిబేట్ వేదికగా నిలుస్తుందని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.
Next Story






