- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శానిటరీ ప్యాడ్స్‌పై రాహుల్ ఫొటో.. బిహార్‌లో కాంగ్రెస్‌పై విమర్శలు
మహిళల్లో ప్రచారం కోసం బిహార్ కాంగ్రెస్ ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ పంచిపెడుతోంది. అయితే వీటిపై రాహుల్ గాంధీ ఫొటో ఉండటం వివాదాస్పదమైంది.

దిశ, నేషనల్ బ్యూరో: మహిళల్లో కాంగ్రెస్‌ను ప్రచారం చేసేందుకు బిహార్ కాంగ్రెస్ వింత నిర్ణయం తీసుకుంది. ఆడవారికి ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ అందించింది. అయితే ఈ ప్యాకెట్లపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చిత్రాన్ని ప్రచురించడం వివాదాస్పదమైంది. మహిళలకు సంబంధించిన ‘శానిటరీ ప్యాడ్స్’ ప్యాకెట్లపై రాహుల్ ఫొటో ఏంటని బీజేపీ సహా ఇతర పార్టీలు కాంగ్రెస్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. బిహార్‌లో మహిళల్లో మెన్‌స్ట్రువల్ శుభ్రత విషయంలో అవగాహన కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ.. ‘ప్రియదర్శిని ఉడాన్ యోజన’ ప్రారంభించింది.
దీనిలో భాగంగా మహిళలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ అందిస్తోంది. బిహార్‌లో ఇండియా బ్లాక్ ప్రభుత్వం ఏర్పడితే, ‘మాయీ బహిన్ సమ్మాన్ యోజన’ కింద మహిళలకు రూ.2500 స్టైఫండ్ అందిస్తామని, దీనిలో భాగంగానే ఈ ప్యాడ్స్ అందిస్తున్నామని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రాజేష్ కుమార్ చెప్పారు. 5 లక్షలకుపైగా శానిటరీ ప్యాడ్ బాక్సులను ఇలా ఉచితంగా పంచుతున్నామని ఆయన వెల్లడించారు. ఈ ప్యాకెట్లపై రాహుల్ గాంధీ చిత్రం ఉండటాన్ని తప్పుబట్టిన జేడీ(యూ).. ‘కాంగ్రెస్‌కు అసలు ఏమైంది? రాజకీయాల్లో ఇదే సైద్ధాంతిక శూన్యత. ఏమాత్రం ఆలోచనలేని ఎలక్షన్ గిమ్మిక్కు’ అంటూ మండిపడింది.






