- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసెంబ్లీ ఎన్నికల్లో మాదే విజయం.. కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప కీలక వ్యాఖ్యలు
కర్ణాటక బీజేపీ నేత బీఎస్ యడియూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు.

బెంగళూరు: కర్ణాటక బీజేపీ నేత బీఎస్ యడియూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ప్రధాని నరేంద్ర మోడీకి సాటిరారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ సంపూర్ణ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం మైనార్టీలకు ఎప్పుడూ అన్యాయం చేయలేదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని భావించడం పగటి కలలు కనడమేనని అన్నారు. ఖర్గే నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ 65 నుంచి 70 సీట్లకే పరిమితం అవుతుందని ఆరోపించారు.
మోడీ అంతర్జాతీయంగా ఆదేశించే స్థాయిని కలిగి ఉన్నారని అన్నారు. అయితే పలు పోల్ సర్వే ఫలితాల్లో బీజేపీ వైఫల్యం చెందుతుందనే నివేదికలను ఆయన ఖండించారు. తాను 50 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాయని, ప్రజల పల్స్ తెలుసని చెప్పారు. క్షేత్రస్థాయిలో పార్టీని నిర్మించుకున్నామని అన్నారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో యడియూరప్ప బరిలో లేరని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పార్టీకి అండగా ఉంటారని కాషాయ వర్గాలు తెలిపాయి.






