Birthday Special: కొత్త ఇంట్లోకి రాహుల్ గాంధీ

by Gantepaka Srikanth |

జన్మదిన వేడుకల వేళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కీలక నిర్ణయం తీసుకున్నారు.

Birthday Special: కొత్త ఇంట్లోకి రాహుల్ గాంధీ
X

దిశ, వెబ్‌డెస్క్: జన్మదిన వేడుకల వేళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కీలక నిర్ణయం తీసుకున్నారు. గురువారం ఢిల్లీ కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారు. సునేరి బాగ్‌లోని 5వ నెంబర్ ఇంటిని లోక్‌సభ సచివాలయం రాహుల్ గాంధీకి కేటాయించింది. కాగా, ఇన్నాళ్లు తల్లి సోనియా గాంధీతో కలిసి జనపథ్‌లో నివసిస్తున్న రాహుల్ గాంధీ.. పుట్టినరోజున కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కాగా, గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నిక అయ్యారు. దీంతో ఆయనకు కేబినెట్ మంత్రి హోదా దక్కడంతో టైప్‌ 8 బంగ్లాకు అర్హులయ్యారు. గతంలో సున్‌హరీ బాగ్‌ నివాసంలో కర్ణాటక బీజేపీ నేత ఏ.నారాయణస్వామి ఉన్నారు. 2021-24 మధ్య కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా నారాయణ స్వామి పనిచేశారు. తాజాగా నారాయణ స్వామి నివాసం ఉన్న ఇంట్లోకి రాహుల్ గాంధీ వచ్చారు.

Next Story